‘డీజే టిల్లు’ ఫేం విమల్‌కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. మెరిన్ ఫిలిప్ కథానాయిక. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. మంగళవారం రాగ్‌మయూర్ పాత్ర ద్వారా ఈ సినిమా రిలీజ్ టైమ్‌ని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో రాగ్‌మయూర్ ‘అనుమాన పక్షి’గా పరిచయమయ్యారు. అతిగా ఆలోచించడం, అతి జాగ్రత్త, చుట్టూ ఉన్నవాళ్లను గందరగోళపరిచే చిత్రమైన పాత్రలో ఆయన ఈ వీడియోలో కనిపించారు. ఫిబ్రవరిలో సినిమా విడుదల కానుందని, త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌కుమార్ నామా, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సహనిర్మాత: భరత్ లక్ష్మీపతి.