కాటుక కళ్లతోని కాటే వేశావే..
‘డీజే టిల్లు’ చిత్రం హీరో సిద్ధు జొన్నలగడ్డకు యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. హైదరాబాద్ లోకల్ యూత్ టిల్లుగా ఆయన నటన అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్కేర్' తెరకెక్కుతున్నది.
‘డీజే టిల్లు’ చిత్రం హీరో సిద్ధు జొన్నలగడ్డకు యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. హైదరాబాద్ లోకల్ యూత్ టిల్లుగా ఆయన నటన అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్కేర్’ తెరకెక్కుతున్నది. మల్లిక్ రామ్ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘రాధిక’ అంటూ సాగే రెండో పాటను విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ రచించిన ఈ గీతాన్ని సంగీత దర్శకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపించారు.
‘ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచు నువ్వు. మీరందరూ కూడా రాధికా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్. టిల్లు గాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది’ అంటూ కథానాయిక అనుపమ పరమేశ్వరన్తో సిద్ధు చెప్పిన డైలాగ్స్ నవ్వుల్ని పంచాయి. ‘రాధికా రాధికా..ముందుకా వెనకకా..కాటుక కళ్లతోని కాటేశావే నువ్వు. సూటిగా చూసి దిల్లు టైటే చేశావే..’ అంటూ పాట ఆద్యంతం హుషారుగా సాగింది. తొలిభాగం కంటే రెండింతల వినోదంతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

