DJ Snake | ఫ్రెంచ్ సంగీతకారుడు, డీజే స్నేక్‌గా ప్రసిద్ధి చెందిన ‘విలియం సమీ ఎటియెన్నే గ్రిగాసిన్’ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. డీజే సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించి, డీజేనే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు ఇతడు. ఇక డీజే స్నేక్ ‘సన్‌బర్న్’ మ్యూజిక్ షో అంటే చాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చిందులేస్తారు. గత ఏడాది డీజే స్నేక్ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ అతడికి ఘన స్వాగతం లభించింది. ఇదిలావుంటే.. తాజాగా ఇతడు పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నేడు క్రిస్మస్ పండుగ సందర్బంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా డీజే స్నేక్ కూడా తన అభిమానులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. వినూత్న రీతిలో పోస్ట్ పెట్టాడు. ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది.. కానీ మరోవైపు ఇజ్రాయిల్ చేతిలో గాజా తగలపడుతుందంటూ ఒక ఫొటో పోస్ట్ చేశాడు. హృదయాలను కదిలిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
— DJ SNAKE (@djsnake) December 24, 2023