నటి, గాయని దియా అందించిన మ్యూజిక్ వీడియో ఆల్బమ్ ‘అరెరే.. అరెరే..’. బటర్‌ఫ్లై మ్యూజిక్ బ్యానర్‌పై రూపొందిన ఈ మ్యూజిక్ వీడియో విడుదల వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, హీరో పూరి ఆకాష్, సమీర్, సాగర్, రఘు కుంచె, శివారెడ్డి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి మేకర్స్‌కి శుభాకాంక్షలు అందించారు.
మా టీమ్ సమిష్టి కృషి వల్లే ఈ ఆల్బమ్ ఇంతబాగా వచ్చిందని, ప్రేక్షకుల ప్రేమ, ఆదరణ ఈ ఆల్బమ్‌కి ఉంటాయని నమ్ముతున్నామని నటి, గాయని దియా నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత నూతన్ చెకురి, దర్శకుడు క్రాంతివర్మ, సంగీత దర్శకుడు శరవణ వాసుదేవన్ కూడా మాట్లాడారు. త్వరలో విడుదల కానున్న ఈ మ్యూజిక్ వీడియోకు కెమెరా: చందు ఏజే.