Guntur karam | సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur karam). ఒక చిన్న టీజర్, ఫస్ట్ లుక్ తప్పితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ ప్రమోషనల్ కంటెంట్ బయటికి రాలేదు. ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచుస్తున్నారు. దసరాకి ఫస్ట్ సింగిల్ వస్తుందని అనుకున్నారు కానీ పోస్టర్ తోనే సరిపెట్టారు.
అయితే దీపావళికి ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ రావడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఫస్ట్ సింగిల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేకంగా ఓ సెట్ వేశారు. మహేష్, శ్రీలీల పై ఓ మెలోడీ నెంబర్ ని షూట్ చేస్తున్నారు. ఈ పాటే దీపావళి ట్రీట్‌గా బయటకు వస్తుందని సమాచారం. తమన్ మహేష్ కి అందించిన ‘సర్కారు వారి పాట’ ఆల్బం మంచి హిట్ అయ్యింది. అందులో కళావతి పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు తమన్ గుంటూరు కారం కోసం కూడా లాంటి మ్యాజిక్ మెలోడిని ట్యూన్ చేశాడని తెలుస్తోంది.
‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.
గుంటూరు కారం మాస్ స్ట్రైక్..