Diwali 2025 | కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈ ఆదివారం ఎపిసోడ్ ఉత్సాహంగా సాగింది. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ఈ ఎపిసోడ్లో నవ్వులు, ఆటపాటలతోపాటు ఎమోషన్లకు కూడా కొదవలేదు. హౌస్ మేట్స్ ఫన్నీ టాస్కులు, నాగార్జున ఎనర్జిటిక్ హోస్టింగ్‌తో ప్రేక్షకులు పండుగ మూడ్‌లో మునిగిపోయారు. ఎపిసోడ్ ఆరంభం నుంచే హౌస్ పండుగ వాతావరణంలో మెరిసిపోయింది. సుదీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ తమ జటాధర సినిమా ప్రమోషన్ కోసం అతిథులుగా వచ్చి వేదికపై సందడి చేశారు. నాగార్జునతో సరదాగా మాట్లాడిన సోనాక్షి తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్‌కి నవ్వులు పంచాడు. సుమన్ శెట్టి నుండి ఇమ్మాన్యుయేల్ వరకూ అందరినీ ఆటపట్టిస్తూ ఫన్ మోమెంట్స్ క్రియేట్ చేశాడు.
నామినేషన్స్‌లో దివ్య, రాము, భరణి, పవన్, తనూజ ఉండగా, స్వీట్ బాక్స్ టాస్క్ ద్వారా ఒక్కొక్కరుగా సేవ్ అయ్యారు. మొదట దివ్య, తర్వాత తనూజ, తరువాత పవన్ సేఫ్ అయ్యారు. చివరగా రాము, భరణి మాత్రమే మిగిలారు. వారిద్దరినీ నాగార్జున యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు. ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న పవర్ అస్త్రను ఉపయోగించే అవకాశం ఇచ్చారు. భరణి కంటే రాము గేమ్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని భావించి, ఇమ్మాన్యుయేల్ రామును సేవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం ఫలితాలు వెల్లడయ్యాయి. రాముకి గ్రీన్ కలర్ (సేఫ్), భరణికి రెడ్ కలర్ (అన్‌సేఫ్) రావడంతో భరణి ఎలిమినేట్ అయ్యారు. నాగార్జున వెల్లడించినట్లుగా, ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర వాడకపోయినా రాము సేవ్ అయ్యేవాడని తెలిపారు.
భరణి ఎలిమినేషన్‌తో హౌస్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తనూజ, దివ్య ఇద్దరూ కన్నీరు పెట్టుకున్నారు. తనూజ ఆయనను తన నాన్నలా భావిస్తానని, దివ్య ఆయనను అన్నయ్యగా చూస్తానని చెప్పి ఏడ్చేశారు. వీరిద్దరూ భరణిని హత్తుకొని వీడ్కోలు పలికారు. మొత్తానికి, ఈ దీపావళి ఎపిసోడ్ నవ్వులు, పండుగ వాతావరణం, ఎమోషన్లతో ప్రేక్షకులకు మిక్స్డ్ ఫీలింగ్ ఇచ్చింది. టాప్ 5లో ఉంటారని భావించిన భరణి హౌస్ విడిచిపోవడం ఫ్యాన్స్‌కి షాకింగ్‌గా మారింది.