బిగ్ బాస్ షోతో పాపులారిటీ అందుకున్న కంటెస్టెంట్స్‌లో దివి ఒకటి. ఈ అమ్మడు బిగ్ బాస్ షోకి రాకముందు పలు సినిమాలలో నటించింది. మహర్షి సినిమాలో కీలక పాత్రను పోషించింది. అయితే అప్పుడు దివిని ఎవరు పెద్దగా గుర్తు పట్టలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టిందో ఈ అమ్మడు తన అంద చందాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. చిరు సైతం ఆమె అందాలకు ఫిదా అయి తన సినిమాలో వేషం ఇస్తానని బిగ్ బాస్ ఫైనల్ రోజు ప్రకటించారు.
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న దివి అప్పుడప్పుడు సోషల్ మీడియాతోను ప్రేక్షకులని అలరిస్తుంటుంది. దివి పోస్ట్ చేసే ఫోటోలు చూసి అభిమానుల మైరచిపోతుంటారు. తాజాగా పసుపు రంగు చీరలో హోయలు పోతూ దివి కొన్ని ఫోటోలు దిగి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి.