కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఉన్నాడు. ఆయన సినిమా కోసం అభిమానుల ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబుకి లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయనని కలవాలని, వీలుంటే షేక్ హ్యాండ్ అయిన ఇవ్వాలని, లేదంటే సెల్ఫీ దిగాలని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటారు. ఇక హీరోయిన్స్ సైతం మహేష్ బాబుతో నటించాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు.అయితే అందాల నటి, బిగ్ బాస్ ఫేమ్ దివికి మహర్షి మూవీలో మహేష్ బాబు సరసన నటించే అవకాశం వచ్చింది.
అప్పట్లో మహేష్ సినిమాలో దివి కనిపించిన సీన్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా దివి మహర్షి సినిమా గురించి, మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు చాలా అందగాడు అనే విషయం అందరికి తెలిసిందే. షూట్లో అమ్మాయిలు అందరు కూడా మహేష్ అందం గురించి మాట్లాడుకునేవాళ్లం. సెట్లో ఒక్క అబ్బాయి కూడా బాగోడు కాని మహేష్ మాత్రం మెరిసిపోతూ ఉండేవారు. మహేష్ బాబుతో నాకు చాలా సీన్స్ ఉండగా, ఎడిటింగ్‌లో చాలా లేపేశారు. అయితే ఆయనకు నుదురు మీద ఒక పుట్టుమచ్చ ఉంటుంది.
మా ఇద్దరి మధ్య సీన్ జరుగుతుంటే గాలికి హెయిర్ పైకి అనుకున్నప్పుడు ఆ పుట్టుమచ్చ చూసాను. ఒక సీన్ లో నేను, మహేష్ గారు మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయాలి. అప్పుడు మీ ఫోర్ హెడ్ మీద పుట్టుమచ్చ చాలా బాగుంది సర్ అంటే ఆయన వెంటనే సీన్‌కి కట్ చెప్పి తెగ నవ్వేసారు. సితారకి కూడా ఆ పుట్టుమచ్చ అంటే ఇష్టం. తాను అలాగే చెబుతుంది. ఈ పుట్టుమచ్చ బాగుంటుంది అని సితార కూడా చెబుతుంటుంది అని మహేష్ అన్నారు. అలా మహర్షి సినిమాలో నాకు బోలెడన్ని మెమోరీస్ అన్నాయి అని దివి చెప్పగా, ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.