Divi | కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మంగ్లీ లేని పోని చిక్కుల్లో పడింది. మంగ్లీ తన బర్త్ డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్‌లో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అనుమతులు లేకుండా డీజే ప్లే చేయడంతో పాటు, పార్టీ సందర్భంగా గంజాయి మరియు విదేశీ మద్యం తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై రిసార్ట్ జీఎం శివరామకృష్ణతో పాటు మంగ్లీపై కేసు నమోదు చేశారు. ఈ పార్టీలో టీవీ సెలబ్రిటీలు దివి, కాసర్ల శ్యామ్ తదితరులు హాజరైనట్లు గుర్తించారు. పార్టీకి దివి కూడా వెళ్లిందని, ఆమె కూడా డ్రగ్స్ సేవించిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దీనిపై దివి స్పందిస్తూ ఓ ఆడియో క్లిప్ ని విడుదల చేసింది.
అక్కడ జరిగిన తప్పులు అన్ని మా మీద వేయడం కాదు. మీడియాలో ప్రూఫ్స్ ఉంటే నా ఫొటోలు వేయండి. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫొటోలు ఎలా వేస్తారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ పిలిస్తే బర్త్ డే అని వెళ్తారు కదా. మంగ్లీ నా ఫ్రెండ్, మంచి అమ్మాయి పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఏదో మిస్టేక్ జరిగితే నాది తప్పు కాదు. నా ఫొటోలు వాడకండి, నా కెరీర్ కి ఇబ్బంది అవుతుంది అంటూ దివి చెప్పుకొచ్చింది. ఈ పార్టీలో దివి , కాసర్ల శ్యామ్, సింగర్ ధనుంజయ్, ఇతర సినీ ప్రముఖులు ఉన్నారు. ఈ పార్టీలో పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. చాలా మందికి నెగిటివ్ వచ్చింది. ఓ నిర్మాతకు పాజిటివ్ రావడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది.
సింగర్ మంగ్లీ ఏర్పాటు చేసిన పార్టీలో సుమారుగా 50 మంది పాల్గొనగా, వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 9 మందికి పాజిటివ్ వచ్చినట్టు తేలింది. ఈ ఘటనపై పార్టీ నిర్వాహకులపై పోలీసులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పుడు ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.