ప్రభాస్ కథానాయకుడిగా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ప్రాజెక్ట్-కె’. నాగ్అశ్విన్ దర్శకుడు. భారీ వ్యయంతో హాలీవుడ్ స్థాయి హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సూపర్‌హీరో కథాంశమిదని సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్ ప్రీలుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దిశా పటాని ముఖ్యపాత్రను పోషిస్తున్నది. బుధవారం ఆమె పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె పెళ్లి కూతురు గెటప్‌లో కనిపిస్తున్నది. ఆమె కళ్లు లోతైన భావాల్ని వ్యక్తం చేస్తూ ఎవరి రాకకోసమో ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా భారీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.