ఏకే జంపన్న దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘క్యాస్ట్’. గోల్డెన్ ప్రొడక్షన్స్ పతాకంపై తోట లక్ష్మీకోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్.