Custody| టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) నటిస్తోన్న బై లింగ్యువల్ ప్రాజెక్ట్ కస్టడీ (Custody). వెంకట్ ప్రభు (Venkat Prabhu) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో NC 22గా వస్తున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియాతో చిట్ చాట్ చేశాడు కస్టడీ విశేషాలు.. డైరెక్టర్ మాటల్లోనే..
వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోందా..?
కోవిడ్ టైంలో నేను తెరకెక్కిస్తున్న మానాడు అడ్డంకులతో చాలా ఆలస్యమవుతూ వచ్చింది. ఈ బ్రేక్ సమయంలో కస్టడీ కథ రాయడం మొదలుపెట్టా. నా మొదటి స్పూర్తి మలయాళం సినిమా నాయట్టు. ఆ సినిమాను చాలా ఎంజాయ్ చేశా. అలాంటి సినిమా చేయాలనుకున్నా.. కానీ కమర్షియల్ ఫార్మాట్లో చేయాలనుకున్నా. కథ రాస్తున్నప్పుడు లవ్‌స్టోరీ సినిమాలోని ఓ పాట చూశా. అప్పుడే నాగచైతన్యను హీరోగా తీసుకోవాలని ఫిక్సయ్యా.
యాక్షన్ పార్టుతోపాటు సినిమాలో లవ్ ట్రాక్ ఉంటుందా..?
హీరోహీరోయిన్ తొలిసారి ఎలా కలుసుకున్నారు.. ప్రేమలో పడ్డారనే కాన్సెప్ట్ ఉండదు. చిన్న టౌన్లో ఉండే కానిస్టేబుల్ శివ వ్యక్తిగత సమస్యలతో సినిమా షురూ అవుతుంది. ఆ తర్వాత అది పెద్ద సమస్యగా మారుతుంది. ఇంటర్వెల్‌కు 20 నిమిషాల ముందు యాక్షన్ షురూ అవుతుంది. ఆ తర్వాత మీ కండ్లను పక్కకు తిప్పుకోలేరు. కస్టడీ చిత్రాన్ని వీలైనంత ఇంట్రెస్టింగ్గా చూపించేందుకు ప్రయత్నించా.
నాలుగు రోజుల్లో జరిగే కథను రాయడం ఎలా అనిపించింది..?
మొదట కస్టడీ కోసం రెండు డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ రెడీ చేశా. ఇతర సినిమాల్లోలాగా అనిపించే ఒక స్క్రీన్ ప్లేను పక్కకు పెట్టాను. రెండు కథలు వేర్వేరు చోట్ల జరిగితే వాటిని ఒకే సమయంలో జరిగేలా చూపించడం లాంటిది. కొంత సమయం తరువాత రెండు కథలు కలిసిపోతాయి. అందుకే ఆ స్క్రీన్ ప్లేతో ముందుకెళ్లలేదు. సినిమాలో అరవింద్ స్వామి గురించి నాగ చైతన్యకు తెలిసినప్పుడే.. అతని పాత్ర గురించి కూడా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి అనుకున్నాను.
అరవింద్ స్వామి సూపర్ ఇమేజ్, చైతన్యకు డిఫరెంట్ ఇమేజ్ ఉంటుంది.. అరవింద్ స్వామిని తీసుకోవడానికి కారణం..?
సినిమాకు అలాంటిదే కావాలనుకున్నా. చైతన్య కన్నా పవర్ ఫుల్ వ్యక్తి కావాలి. కస్టడీలో అరవింద్ స్వామి, శరత్‌కుమార్ లాంటి దిగ్గజాలుంటారు. సినిమాలో వారితో పోలిస్తే చైతన్య తక్కువగా కనిపిస్తారు. సవాళ్లను ఎలాఎదుర్కొన్నాడనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
కృతిశెట్టి పాత్ర గురించి..
కృతిశెట్టి ఇందులో రేవతి పాత్రలో కనిపిస్తుంది. డ్రైవింగ్ స్కూల్ శిక్షకురాలు. ఆమె మంచి నటి. చాలా యాక్టివ్‌గా, పరిణతి ఉన్న యాక్టర్ కావాలనుకున్నాం. కృతిశెట్టి విషయంలో మొదట కొంత సంకోచించా. కానీ ఆమెనపు కలిశాక.. రేవతి పాత్రకు పర్ఫెక్ట్గా సరిపోతుందని ఫిక్సయ్యా.
Timeless Love లిరికల్ వీడియో సాంగ్..
హెడ్ అప్ హై లిరికల్ వీడియో సాంగ్..
స్టడీ గ్లింప్స్ వీడియో..
నాగచైతన్య కస్టడీ టీజర్ టీజ్..
కస్టడీ టీజర్..