Trinath Rao Nakkina | కాస్త ట్రాక్ మార్చండి బాసు.. లేదంటే తర్వాత చుక్కలు కనిపిస్తాయి..!
రొటీన్ కథను బోర్ కొట్టకుండా ఎక్కువసార్లు చెప్పడం కూడా ఒక కళ. అలాంటి కళాకారులే ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కిన. 'సినిమా చూపిస్త మామ' నుంచి ఒకే సినిమా చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ.
Trinath Rao Nakkina And Bejawada Prasanna kumar | రొటీన్ కథను బోర్ కొట్టకుండా ఎక్కువసార్లు చెప్పడం కూడా ఒక కళ. అలాంటి కళాకారులే ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కిన. ‘సినిమా చూపిస్త మామ’ నుంచి ఒకే సినిమా చూపిస్తున్నారు వీళ్ళిద్దరూ. అప్పటినుంచి వీళ్లకు తెలిసిన ఫార్ములా ఒక్కటే. రొటీన్ కమర్షియల్ కథలని మిక్సీలో వేసి గ్రైండర్ చేసి.. వచ్చిన కథలను వేరే వేరే హీరోలకు చెప్పి సినిమాలు చేస్తున్నారు. ‘సినిమా చూపిస్త మామ’ తర్వాత ‘నేను లోకల్’లో కూడా దాదాపు అదే కథ ఉంటుంది. ‘హలో గురు ప్రేమకోసమే’ కూడా అక్కడక్కడే తిరుగుతుంది. టైటిల్స్ మారుతున్నా కథ, కథనాలు మాత్రం అలాగే ఉంటున్నాయి.
విచిత్రం ఏంటంటే వీళ్ళు ప్రతిసారి మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ‘ధమాకా’లో కూడా అది మిస్ అవ్వలేదు. రవితేజ నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారో అది ఇచ్చారు. పరమ రొటీన్ రొడ్డ కొట్టుడు కథ అయినా కూడా.. కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఉన్నాయి. మాస్ రాజా సినిమా ఎలా ఉండాలో లెక్కలేసుకొని తీసినట్టు అనిపించింది. ఫస్టాఫ్ పర్లేదు.. అక్కడక్కడ హైపర్ ఆది జబర్దస్త్ పంచులు నవ్వించాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ట్విస్టులు ఏమీ లేకుండా రొటీన్ గానే వెళ్తుంది.
ముఖ్యంగా ఏ హీరోతో సినిమా చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఏమి కోరుకుంటారు అనేది ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కిన బాగా అంచనా వేస్తున్నారు. తాజాగా ధమాకాలో ఇంద్ర సీన్ రీ క్రియేషన్.. గాజువాక కండక్టర్ సాంగ్ బాగా కుదిరాయి. రవితేజ మరోసారి మాస్ క్యారెక్టర్ లో దుమ్ము దులిపాడు. టైం బాగుంది కాబట్టి కలిసి వస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ప్రసన్నకుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కినకు షాక్ పక్కా. అన్నట్టు త్వరలోనే ప్రసన్నకుమార్ దర్శకుడు అవుతున్నాడు. నాగార్జున హీరోగా ఈయన సినిమా చేయబోతున్నాడు. అతడు పక్కకు వెళ్ళిపోతే త్రినాధ రావు నక్కిన పరిస్థితి ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

