Ee Nagaraniki Emaindhi Movie Re-Release | ఐదేళ్ల క్రితం వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. పెట్టిన బడ్జెట్ కు రెండింతలు కలెక్ట్ చేసింది. కలెక్షన్ల సంగతి అటుంచితే యూత్ ను మాత్రం ఈ సినిమా తెగ ఆకట్టుకుంది. యూత్ అంతా గ్యాంగ్ లేసుకుని మరీ థియేటర్లలో రచ్చ రచ్చ చేశారు. ఈ సినిమాకు సీక్వెల్ తీయమని తరుణ్ భాస్కర్ ను విసిగించని నెటిజన్ లేడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ డిమాండ్ చేశారు. కాగా ఇప్పుడు రీ-రిలీజ్ కు అన్ని కుదిరినట్లు తెలుస్తుంది.
తాజాగా తరుణ్ భాస్కర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బ్లాక్ కలర్ షేడ్స్ పెట్టుకున్న ఎమోజీని పెట్టాడు. దాంతో అది ఈ నగరానికి ఏమైంది సినిమా రీ-రిలీజ్ అప్డేట్ అని నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సినిమా మొత్తం బ్లాక్ షేడ్స్ పెట్టుకుంటాడని తెలిసిందే. మరీ ఇది రీ రిలీజ్ అప్డేట్ ఏనా మరేదైనా అప్డేటా అనేది తెలియాల్సి ఉంది. విశ్వక్ సేన్, అభినవ్ గౌతమ్, వెంకటేష్, సాయి సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గెస్ట్ రోల్ పోషించాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు.