కెరీర్ ఆరంభంలో పలు తెలుగు చిత్రాల్లో నటించారు అగ్ర హీరో విక్రమ్. అయితే తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత తెలుగులో స్ట్రెయిట్ చిత్రాన్ని చేయలేదు. ఇక్కడ స్ట్రెయిట్ సినిమా చేయాలన్నది తన కల అని చాలా సందర్భాల్లో చెప్పారు విక్రమ్. విశ్వసనీయ సమాచారం ప్రకారం అందుకు ఆయన రంగం సిద్ధం చేశారని తెలిసింది. అగ్ర దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్దేశకత్వంలో విక్రమ్ ఓ తెలుగు సినిమాకు ఓకే చెప్పారని అంటున్నారు. యాక్షన్, థ్రిల్లింగ్ అంశాల నేపథ్యంలో సురేందర్ రెడ్డి చెప్పిన కథ బాగా నచ్చడంతో విక్రమ్ వెంటనే అంగీకరించారని చెబుతున్నారు. అయితే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది. పవన్‌కల్యాణ్‌తో సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే వెంకటేష్‌తో కూడా ఓ సినిమా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే విక్రమ్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందంటున్నారు.