హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సురేందర్‌రెడ్డి గాయపడ్డారు. ఏజెంట్ షూటింగ్లో సురేందర్‌రెడ్డి గాయపడ్డారు. అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ సినిమాను సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఎడమకాలికి గాయం కావడంతో ఆయన నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గాయానికి చికిత్స చేయించుకున్న తర్వాత ఆయన తిరిగి సెట్‌కు వెళ్లిపోయారు. అయితే, ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య నటిస్తున్నది. మలయాళీ సూపర్‌స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ పవర్ ప్యాక్‌గా ఈ సినిమా రాబోతున్నది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడింది. చిత్రంలో అఖిల్ లుక్ అల్ట్రా స్ట్రైలిష్‌గా ఉండటమే కాకుండా.. అటు మాస్ ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఉన్నది.
ఇప్పటికే విడుదలైన ఏజెంట్ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను సమకూర్చారు. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.