సుకుమార్ కొత్త సినిమా అంటే టెక్నికల్ టీమ్‌ను ఎంచుకోవడం పెద్ద పనేం కాదు. వారెప్పుడూ ఆయనకు సిద్ధంగానే ఉంటారు. ఆర్టిస్టుల ఎంపికే సుకుమార్‌కి పెద్ద పని. ‘పుష్ప 2’ తర్వాత ఆయన రామ్‌చరణ్‌తో సినిమా చేయనున్నారు. కథను కూడా లాక్ చేసేశారు. ఈ కథలో హీరోయిన్ పాత్ర కీలకమని సమాచారం. ఆ పాత్ర కోసం కృతీ సనన్‌ను తీసుకోవాలనుకుంటున్నారట సుకుమార్. తన కథలో నాయిక పాత్రకు కృతి సనన్ సరిగ్గా సరిపోతుందని సుకుమార్ భావించారట.
సాధారణంగా కథానాయికను ఆడిషన్, ఫొటో షూట్ చేసి తీసుకోవడం సుకుమార్ ఆనవాయితీ. కృతీ సనన్ అయితే అలాంటి అవసరం లేకుండానే, నిస్సంకోచంగా తీసుకోవచ్చని సుకుమార్ భావిస్తున్నారట. ఇప్పటికే సుకుమార్‌తో పనిచేసిన అనుభవం కృతి సనన్‌కి ఉంది. మహేశ్ ‘వన్’ సినిమాలో ఆమే కథానాయిక. ఈ సినిమా ఖరారైతే సుకుమార్ డైరెక్షన్లో రెండోసారి నటించినట్టవుతుంది.