‘ఆర్య’ నుంచి ‘నాన్నకు ప్రేమతో’ వరకూ రెట్రో కల్చెర్ మూవీసే చేశారు పానిండియా డైరెక్టర్ సుకుమార్. సుకుమార్ అంటే క్లాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ అని అంతా అనుకుంటున్న సమయంలో ఒక్కసారి ‘రంగస్థలం’తో పంథా మార్చారు. పక్కా రూరల్ యాక్షన్ డ్రామా తీస్తే, తానెలా తీస్తాడో ‘రంగస్థలం’తో ప్రేక్షకులకు రుచి చూపించారాయన. ఇక ఆ తర్వాత ‘పుష్ప’ ఫ్రాంచైజీ గురించి తెలిసిందే. పానిండియా రికార్డులన్నీ షేకైపోయాయి.
ప్రస్తుతం ఆయన రామ్‌చరణ్ కోసం స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. విశేషమేంటంటే.. ఏ రామ్‌చరణ్ సినిమాతో తన స్టైల్ మార్చి మాస్ సినిమాలు తీయడం మొదలుపెట్టారో.. ఇప్పుడు అదే రామ్‌చరణ్ సినిమాతో మళ్లీ ప్రయోగానికి తెర తీయనున్నారట సుకుమార్. ఈసారి వీరిద్దరి కాంబోలో రానున్న సినిమా పూర్తి స్టైలిష్‌గా ఉంటుందట. రామ్‌చరణ్ లుక్స్, గెటప్ మోడ్రెన్‌గా ఉంటాయట. అయితే.. ఇప్పటివరకూ సుకుమార్ తీసిన సినిమాల్లో లేని కొత్త అంశాలు ఈ కథలో ఉంటాయని సమాచారం. ‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్ చేసే సినిమా ఇదే.