Director Siddique | ప్రముఖ మాలయాళ స్టార్ దర్శకుడు సిద్దిఖీ మరణించాడు. సోమవారం గుండెపోటుకు గురైన సిద్దిఖీను ఆయన కుటుంబ సభ్యులు కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటుంగానే మంగళవారం సాయంత్రం సిద్దిఖీ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం పట్ల మాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. రచయితగా కెరీర్ ప్రారంభించిన సిద్దిఖీ 1989లో రామ్‌జీ రావు స్పీకింగ్ అనే కామెడీ థ్రిల్లర్‌తో మెగాఫోన్ పట్టాడు. తొలిసినిమానే తిరుగులేని పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మలయాళ స్టార్ హీరోలైన మోహన్‌లాల్, మమ్ముట్టి, విజయ్ కాంత్‌లకు బ్లాక్‌బస్టర్ సినిమాలిచ్చాడు.
ఇక హిందీలో సల్మాన్‌తో బాడీగార్డ్ తీసి, అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో నితిన్‌తో మారో సినిమా చేసాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. చివరగా సిద్దిఖీ మోహన్‌లాల్‌తో బిగ్ బ్రదర్ సినిమా చేశాడు. చిరంజీవి రీమేక్ చేసిన హిట్లర్, రాజశేఖర్ రీమేక్ చేసిన మా అన్నయ్య సినిమాలు ఈయన మలాయళంలో తెరకెక్కించినవే. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా, ప్రొడ్యూసర్‌గా, న్యాయ నిర్ణేతగా ఇలా పలు విభాగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సిద్దిఖీ అంత్యక్రియలు బుధవారం జరుగనున్నాయి.