S Shankar | తనపై తెలుగు అభిమానులు అపారమైన ప్రేమను చూపించారని.. వారికి ప్రేమను తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశంతో.. స్ట్రెయిట్‌గా తెలుగులో గేమ్ ఛేంజర్ రూపంలో సినిమాను చేశానని దర్శకుడు శంకర్ అన్నారు. రాజమండ్రిలో ఏర్పాటు చేసిన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. తాను డబ్బి చిత్రాలతో తెలుగులో అభిమానులను సంపాదించుకున్నానని.. తెలుగు ఇప్పటి వరకు నేరుగా ఒక్క చిత్రానికి చేయలేకపోయానన్నారు. ఆ లోటు గేమ్ ఛేంజర్ తీరినట్లయ్యిందన్నారు. తెలుగులో చిత్రం చేయాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటూ ఉన్నానని.. ఈ విషయంలో దిల్ రాజు, రామ్ చరణ్ సహకారం అందించారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
గేమ్ ఛేంజర్ తెలుగు చిత్రమని.. అన్ని తెలుగు సంప్రదాయాలే ఉండాలని.. తెలుగు సంస్కృతే కనిపించాలనే ఉద్దేశంతో తెలుగు నటీనటులనే తీసుకున్నామన్నారు. సినిమా చిత్రీకరణ సైతం ఎక్కువగా తెలుగు లొకేషన్లలోనే జరిగిందన్నారు. చిత్ర కథ ఒక కలెక్టర్, మంత్రికి జరిగే యుద్ధమే గేమ్ ఛేంజర్ అన్నారు. హీరో వెనుక ఓ స్టోరీ ఉంటుందని.. అదే కథలోని మేయిన్ పాయింట్‌తో మిగిల్ అవుతుందన్నారు. ఈ చిత్రంలో హీరో రామ్ చరణ్ నటించలేదని.. జీవించాడంటేనే బాగుంటుందన్నారు. హుందాగా, ఎంతో హృద్యంగా నటించాడంటూ అభినందనలు తెలిపారు. మూవీలో నటించిన హీరోయిన్లు కియారా అద్వానీ, అంజలితో పాటు శ్రీకాంత్, ఎస్జే సూర్య, నవీన్‌చంద్ర, సంగీత దర్శకుడు తమన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.