Director Ritesh Rana | మత్తు వదలరా, హ్యాపి బర్త్డే, మత్తు వదలరా 2 చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రితేష్ రానా. తన కొత్త సినిమాను ప్రకటించాడు. కమెడియన్ సత్యను లీడ్ రోల్గా పెట్టి అతడు ఈ సినిమాను తెరకెక్కించబోతుండగా.. ఈ సినిమాను క్లాప్ ఎంటర్టైనమెంట్ బ్యానర్ నిర్మిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ సమర్పిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు జెట్లీ (JETLEE) అనే టైటిల్ను నిర్ణయించినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా సత్య ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకుంటూ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపింది చిత్రయూనిట్. ఈ పోస్టర్లో సత్య విమానం పైన ఎక్కి కామెడీ సినిమాలతో నేను విసిగిపోయానంటూ హీరో అవ్వబోతున్నానంటూ ఫన్నీగా ఫోజులిచ్చాడు. ఈ సినిమాలో సత్య సరసన రియా సింగా కథానాయికగా నటించబోతుండగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు కీరవాణి కుమారుడు కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.

Jetlee