Kingdom Movie | కొత్త సినిమాలు వస్తున్నాయంటే చాలు ప్రేక్షకులకంటే ముందుంటాడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి. సినిమా బాగుంది అని టాక్ వచ్చిన వెంటనే ఆ సినిమాకు వెళుతుంటాడు. ఇటీవల హాలీవుడ్ నుంచి వచ్చిన F1 సినిమా చూస్తూ మీడియా కంట పడ్డా రాజమౌళి మరోసారి సినిమాకు వచ్చి కెమెరా కంట చిక్కాడు. అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కింగ్డమ్. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. నాగవంశీ నిర్మించాడు. సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీని చూడడానికి రాజమౌళి ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.
Maverick director #SSRajamouli at @AparnaCinemas to watch #Kingdom With Family 💥🔥❤️🔥#VijayDeverakonda #NagaVamsi pic.twitter.com/suvW7beCh0
— Suresh PRO (@SureshPRO_) August 1, 2025