బ్రహ్మాస్త్ర సినిమాతో మొదటి హిట్ కోసం వెయిట్ చేస్తున్న రాజమౌళి
Director Rajamouli | వినడానికి విచిత్రంగా ఉంది కదా.. రాజమౌళికి మొదటి హిట్ ఏంటి ఆయన పట్టిందల్లా బంగారమే.. చేసిందల్లా హిట్టే కదా అనుకుంటున్నారుగా. కానీ ఈయన నిజంగానే మొదటి హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు. దర్శకుడుగా రాజమౌళికి తిరుగులేదు. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. ఎన్నో లాభాలు తీసుకొచ్చింది కానీ.. ఒక్కసారి ఆ దర్శకుడు అనే జోనర్ నుంచి బయటికి వచ్చి రాజమౌళి ఏం చేసినా కూడా అతడికి ఫ్లాప్ తప్ప ఇంకేమీ రాలేదు.
పదేళ్ల కింద హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన అందాల రాక్షసి సినిమా నిర్మాతల్లో ఎస్ఎస్ రాజమౌళి కూడా ఉన్నాడు. ఈ సినిమాను సాయి కొర్రపాటితో కలిసి నిర్మించాడు రాజమౌళి. కాకపోతే ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. దానికంటే ముందే నాగార్జున హీరోగా వచ్చిన రాజన్న సినిమాకు యాక్షన్ డైరెక్టర్‌గా ఉన్నాడు రాజమౌళి. ఇందులో యాక్షన్ సన్నివేశాలను జక్కన్న తెరకెక్కించాడు. తండ్రి విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు రాజమౌళి. దీనికి కూడా ప్రశంసలు వచ్చాయి.. కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ బ్రహ్మాస్త్ర ( Brahmastra )సినిమాకు సమర్పకుడిగా ఉన్నాడు రాజమౌళి. సౌత్‌లో ఈ సినిమాను కేవలం తన బ్రాండ్ మీద విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాకు అన్నీ తానే అయి ప్రమోషన్ చేస్తున్నాడు దర్శక ధీరుడు.
అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను 300 కోట్లతో నిర్మించాడు కరణ్ జోహార్. నాగార్జున, అమితాబ్ బచ్చన్ ఇందులో కీలకపాత్రలో నటించారు. సెప్టెంబర్ 9న సినిమా విడుదల కానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ రావడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాతో తన కెరీర్లో దర్శకుడిగా కాకుండా.. ఇతర విభాగాల్లో కూడా మొదటి హిట్ కొట్టాలని ఆసక్తిగా వేచి చూస్తున్నాడు రాజమౌళి. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Read More :
“Brahmastra Movie | ఆసక్తికరంగా ‘బ్రహ్మస్త్ర’ ప్రీ రిలీజ్ ప్రోమో..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

