Brahmastra Movie | ఆసక్తికరంగా ‘బ్రహ్మస్త్ర’ ప్రీ రిలీజ్ ప్రోమో..!
Brahmastra Pre-Release Promo | ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘బ్రహ్మస్త్ర’ ఒకటి. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ సింగ్, అలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. తెలుగులో బ్రహ్మస్త్రం పేరుతో విడుదల కానుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో దర్శక దిగ్గజం రాజమౌళి విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. నాగార్జున కీలకపాత్రలో నటించడంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఈ చిత్రం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ఇస్తున్నారు. తాజాగా మూకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రోమోను విడుదల చేశారు.
‘జై బ్రహ్మదేవ్.. ఆశీర్వదించండి నేను బ్రహ్మస్త్రాన్ని సాధించి తీసుకువస్తాను’ అంటూ మౌనీ రాయ్ డైలాగ్‌తో ప్రొమో స్టార్ట్ అవుతుంది. ‘అందులో బ్రహ్మండంలోని శక్తి మొత్తం నిండి ఉంది’. ‘ఆ మూడు భాగాలు కలిసాయంటే ఈ లోకం సర్వం నాశనమవుతుంది’ అంటూ వచ్చిన డైలాగ్స్ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ మూడు భాగాలను కలపకుండా రణ్‌బీర్ ఎలాంటి పోరాటాలు చేశాడు. తన కున్న అగ్నీ శక్తితో ప్రపంచాన్ని ఎలా కాపాడాడు అనేది సినిమాలో చూడాలి. ప్రోమోలో విజువల్స్ గ్రాండియర్‌గా ఉన్నాయి. చిత్రబృందం తరచూ ఏదో ఒక అప్డేట్తో ప్రేక్షకులలో అంతకంతకు అంచనాలను పెంచుతూ ఉన్నారు.
మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా తెరకెక్కనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. బిగ్‌బీ అమితాబ్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో మౌనీరాయ్ విలన్ పాత్రలో నటించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కాగా శుక్రవారం బ్రహ్మస్త్ర టీం పార్క్ హయత్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్‌మీట్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చాడు.
Here’s #Brahmastra PRE-RELEASE PROMO… Advance Bookings Open Now!
Experience Brahmāstra in cinemas on September 9th. pic.twitter.com/9GFZWLwhrf
— rajamouli ss (@ssrajamouli) September 3, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

