Swara Bhaskar | బాలీవుడ్‌ను నాశనం చేయాలని చూస్తున్నరు.. ‘బాయ్‌కాట్’ ట్రెండ్‌పై స్వరా భాస్కర్ స్పందన
Swara Bhaskar | ప్రస్తుతం బాలీవుడ్లో బాయ్‌కాట్ ట్రెండ్ కొనసాగుతున్నది. ఏ సినిమా విడుదలైనా ‘బాయ్‌కాట్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీంతో సినిమాలపై తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన చాలా చిత్రాలన్నీ డిజాస్టర్‌గా నిలిచాయి. ఇందుకు ఉదాహరణ అమీర్‌ఖాన్ ‘లాల్‌సింగ్ చడ్డా’ చిత్రంతో పాటు అక్షయ్‌కుమార్ ‘రక్షాబంధన్’ చిత్రానికి సైతం ‘బాయ్‌కాట్’ సెగ తప్పలేదు. దీంతో ఆయా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. మరో వైపు దక్షిణాది చిత్రాలు బాలీవుడ్లో దుమ్మురేపుతున్నాయి.
దక్షిణాది చిత్రాలను చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు మేల్కోవాలని సూచిస్తున్నారు. మరో వైపు ‘బాయ్‌కాట్’ ట్రెండ్‌పై పలువురు నటీనటులు స్పందించగా.. తాజాగా బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సైతం స్పందించింది. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్‌ను నాశనం చేయాలని చేస్తున్నారని, ఇందు కోసం ప్రత్యేకంగా పరిశ్రమ ఉద్భవించిందని ఆరోపించింది. ట్వీట్లు, ట్రోల్స్ చేసినందుకు వారికి సరైన మొత్తాన్ని పొందుతున్నారంటూ విమర్శించింది.

ఒకే వ్యక్తి వంద సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తాడని, అందులో కొన్ని ఏజెన్సీలు పాల్గొంటాయని.. ఇది అందరికీ తెలిసిన విషయమేనని వ్యాఖ్యానించింది. ఇది కేవలం పూర్తిగా కృత్రిమమని, కానీ ప్రజలు సాధారణంగా జరుగుతుందని భావిస్తున్నారని పేర్కొంది. బాయ్‌కాట్ అనేది సినిమా వసూళ్లపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలియని చెప్పింది. అయితే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెందిన సమయంలో.. ఆయన మరణాన్ని వ్యక్తిగతంగా తీసుకొని తమ ప్రయోజనాలను వాడుకునే ప్రయత్నం చేశారని విమర్శించింది.
సినిమాలు ఆడకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చన్న స్వరా.. ప్రజల అభిరుచులు మారుతున్నాయని, కుటుంబ సమేతంగా ప్రజలు థియేటర్లో సినిమాలు చూడాలంటే భయపడుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రజల వద్ద డబ్బు లేకపోవడం పెద్ద విషయమని, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారన్నారు. అందరూ ఫ్లాప్ సినిమాల గురించి మాట్లాడుతున్నారే కానీ.. గంగుబాయ్ కతియావాడి, భూల్ భూలయ్య-2 సినిమాలు హిట్ అయ్యాయని, వాటి గురించి ఎవరూ మాట్లాడడం లేదంటూ నిలదీసింది. ప్రస్తుతం సర్వా భాస్కర్ ‘జహాన్ చార్ యార్’ చిత్రంలో నటిస్తుండగా.. త్వరలో ప్రేక్షకుల ముందుకురానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

