అమిత్ తివారి, భానుశ్రీ, నాజర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ దర్శకుడు. ఆర్.ఎమ్ నిర్మించారు. ఈ చిత్రంలోని ‘మన్నిస్తారా మూగజీవులారా’ అనే పల్లవితో సాగే గీతాన్ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదలచేశారు. పీఆర్ సంగీతంతో పాటు సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని కాలభైరవ ఆలపించారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘పాటను చిత్రీకరించిన విధానం బాగుంది. అర్థవంతమైన సాహిత్యంతో మనసుల్ని కదిలించేలా ఉంది. జంతువుల పట్ల ఎంత అమానుషంగా ఉంటున్నామో చాటిచెబుతున్నది’ అని అన్నారు. నల్లమల అడవి చుట్టూ జరుగుతున్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాలో తనికెళ్లభరణి, కాలకేయప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.