Director PremKumar | 96, మెయ్యాళగన్ సినిమాలతో సూపర్హిట్లు అందుకున్నాడు తమిళ దర్శకుడు సీ.ప్రేమ్ కుమార్. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవడంతో పాటు క్లాసిక్‌గా నిలిచాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ప్రేమ్ కుమార్ 96 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
96 సినిమాను మొదట హిందీలో తీయాలనుకున్నాను. అభిషేక్ బచ్చన్‌తో ఈ సినిమా తీయాలని ప్లాన్ ఉండేది. అయితే ఆ టైంలో అభిషేక్ బచ్చన్ కాంటక్ట్ దొరకకపోవడం వలన తమిళంలో నా స్నేహితుడు విజయ్ సేతుపతితో తెరకెక్కించాను. నాకు చిన్ననాటి నుంచే హిందీ వచ్చు. మా నాన్నగారు నార్త్ ఇండియాలో పెరిగాడు. అందుకే ఆయన ప్రభావం నాపై ఉండేది. దీంతో నేను ఎప్పుడు హిందీ సినిమాలు చూసేవాడిని. అలా నాకు హిందీ వచ్చు. అయితే 96 సినిమాను లార్జ్ స్కేల్లో చేద్దామనుకున్నాను. అందుకే హిందీలో చేయాలని ఉండేదంటూ ప్రేమ్ కుమార్ చెప్పుకోచ్చాడు.
Now I can dare say that 96 was actually written for Hindi. I wanted to pitch it to #AbhishekBachchan.
I desperately wanted to do remake 96 and #Meiyazhagan both in hindi and I even tried for probably a year and half.
– Director #PremKumar pic.twitter.com/AjNO7eNd3F
— Whynot Cinemas (@whynotcinemass_) July 9, 2025