జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’. పూర్వాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రజయ్ కామత్, ఎ.పద్మనాభరెడ్డిలతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే దశలో ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ ‘ఇది ఇండియాలోనే తొలి సూపర్ షీ మూవీ. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కఠభరితంగా సినిమా ఉంటుంది.
ప్రచార చిత్రాలు ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం.’ అని చెప్పారు. విశాల్‌రాజ్, దశరథ, చందూ, గౌతమ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్, సుమన్ జీవ, సమర్పణ: ఉర్వీష్ పూర్వాజ్, నిర్మాణం: థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.