HomeCinemaDirector Parasuram Vijay Devarakonda New Movie Family Star
Vijay Devarakonda | విజయ్ దేవరకొండ ‘యుద్ధం’
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్' (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది.
అగ్ర హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో దిల్రాజు నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న స్పై థ్రిల్లర్ షూటింగ్కు సిద్ధమవుతున్నది.
దిల్రాజు నిర్మాణంలో రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. 1980 దశకం నేపథ్యంలో మాఫియా బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు చేయని పవర్ఫుల్ యాక్షన్ రోల్లో కనిపిస్తారని, ఈ చిత్రానికి ‘యుద్ధం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.