Pa Rannjith Praises On Virata Parvam | రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘విరాటపర్వం’. ఎన్నో వాయిదాల తర్వాత గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటీవ్ టాక్‌ను తెచ్చుకుంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రానా, సాయిపల్లవిలు వాళ్ళ పాత్రలో ఒదిగిపోయారు. వేణు బ్రిలియంట్ రైటింగ్, సురేష్ బొబ్బిలి సంగీతం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇప్పటికే సినిమాను వీక్షించిన పలువురు సెలబ్రిటీలు చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. కాగా తాజాగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ పా.రంజిత్ విరాటపర్వం మేకర్స్‌ను ట్విట్టర్లో ప్రశంసించాడు.
ఇటీవలే ‘సార్పట్ట పరంపర’తో సక్సెస్ అందుకున్న పా.రంజిత్ విరాటపర్వం చిత్రాన్ని చూసి మేకర్స్‌ను అభినందించాడు. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన తెలుగు సినిమాల్లో విరాటపర్వం అత్యుత్తమమైనది. ఎలాంటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు వేణు ఊడుగుల, నిర్మాతలు చాలా ప్రశంసలు అందుకోవాలి. ఇలాంటి పాత్రను అంగీతకరించి, నటించినందుకు రానాకు అభినందనలు. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది’ అంటూ ట్విటర్లో ప్రశంసలు కురిపించాడు.
ఈ చిత్రంలో రవన్న పాత్రలో రానా నటించగా.. వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటించింది. ప్రియమణి, నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరా సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి సురేష్‌బాబు నిర్మించాడు.
#Viraataparvam is the best Telugu film I've watched in recent times. Producers & dir @venuudugulafilm deserve much appreciation for making this film without any compromises.Special appreciations to @RanaDaggubati for accepting &doing this role & @Sai_Pallavi92 has done superbly👏
— pa.ranjith (@beemji) June 19, 2022