అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’. నాని కాసరగడ్డ దర్శకుడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ‘పొలిమేర’ఫేమ్ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మిస్టరీ మర్డర్స్ చూట్టూ జరిగే సంఘటనలతో ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది.
హీరోకి ఎదురైన భయానక అనుభవాలు..వాస్తవం, భ్రమ తాలూకు సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. ఇలాంటి థ్రిల్లర్ జోనర్ కథతో ఇంతవరకు సినిమా చేయలేదని, ఎవరూ ఊహించని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, చివరివరకు విలన్ ఎవరో ప్రేక్షకుల అస్సలు ఊహించలేరని అల్లరి నరేష్ అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసేవాళ్లకి ఈ సినిమా మంచి ట్రీట్‌లా ఉండబోతున్నదని షోరన్నర్ అనిల్ విశ్వనాథ్ తెలిపారు.