సుమన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, కారుణ్య కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘తొలి తొలి ముద్దు..’ అనే పాటను దర్శకుడు మారుతి విడుదలచేశారు. ప్రమోద్ సంగీతాన్ని అందించారు. అంజనా సౌమ్య, హేమచంద్ర ఈ పాటను ఆలపించారు. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలో సినిమాను విడుదలచేస్తాం’ అన్నారు.