ఒకే ఒక్క పాత్రతో రూపొందుతున్న చిత్రం ‘హలో మీరా’. గార్గేయ యల్లాప్రగడ నటించిన ఈ చిత్రానికి కాకర్ల శ్రీనివాస్ దర్శకుడు. ప్రయోగాత్మక కథతో రూపొందుతున్న ఈ థ్రిల్లింగ్ చిత్రాన్ని డా.లక్ష్మణ్‌రావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు హరీష్‌శంకర్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి రాత్రికి రాత్రి ఆ పెళ్లి కాదనుకుని హైదరాబాద్‌కు బయలుదేరడం, ఇంతలో అమ్మనాన్న, ఫ్రెండ్స్, ప్రేమికుడు, పోలీసుల నుంచి ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడం.. ఇలాంటి ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది’ అన్నారు.