హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): భారత ప్రజాస్వామ్యం పరిహాసానికి వేదికగా మారిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇది ఏండ్ల నుంచి లోతుగా పాతుకుపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత ప్రజాస్వామ్యం ఐదు ‘సీ’లకు బందీగా మారిందని వ్యాఖ్యానించారు. కులం (క్యాస్ట్), నగదు (క్యాష్), మతతత్వం (కమ్యూనలిజం), అవినీతి (కరప్షన్), నేరపూరిత రాజకీయాలు (క్రిమినాలిటీ) ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ మేరకు కార్టూనిస్ట్ మంజుల్ వేసిన కార్టూన్‌ను పోస్టు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నెలకొన్న పరిణామాలపై తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.