అట్టికా గోల్డ్‌పై ఈడీ పంజా
చోరీకి గురైన బంగారు వస్తువుల కొనుగోలు, సేకరణ, ఇతర అక్రమ లావాదేవీల ద్వారా నేరపూరిత ఆదాయాన్ని ఆర్జించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పంజా విసిరారు.
- హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలో సోదాలు
- 7.52 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బంగారు, వెండి వస్తువులు సీజ్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): చోరీకి గురైన బంగారు వస్తువుల కొనుగోలు, సేకరణ, ఇతర అక్రమ లావాదేవీల ద్వారా నేరపూరిత ఆదాయాన్ని ఆర్జించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు పంజా విసిరారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో ఈ నెల 23, 24న ఆ కంపెనీకి సంబంధించిన 16 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ‘అట్టికా గోల్డ్’ ప్రధాన కార్యాలయం, శాఖలతోపాటు ఆ కంపెనీ డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, వాటాదారులు, ఇతర కీలక వ్యక్తుల నివాస, వ్యాపార ప్రాంగణాల్లో జరిగిన ఈ సోదాల్లో రూ.7.52 లక్షల నగదుతోపాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది.
‘అట్టికా గోల్డ్’పై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లు, పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. ఈ కేసులో పీఎస్ అయూబ్ అలియాస్ బొమ్మనహళ్లి బాబు, ఒబెదుల్లా ఏ మహ్మద్ సల్మాన్ ఏ అర్బిన్ తాజ్ తదితర కీలక వ్యక్తులు పరారీలో ఉన్నట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

