భారతీయ సినిమా చరిత్రలోనే అతి పొడవైన టైటిల్‌తో దర్శకుడు చంద్రసిద్ధార్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఈ పాటకోరిన వారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, డోల్ రవి మొదలగువారు’ అనేది సినిమా టైటిల్. దీనికి ‘ఏ ఫర్బిడెన్ రాగ ఫ్రమ్ ఏ ఫర్బిడెన్ సాగా’ అనే ఉపశీర్షికను పెట్టారు.
ఈ చిత్రం ద్వారా హర్ష హీరోగా పరిచయమవుతున్నాడు. ఫిల్మోత్సవ్ పతాకంపై చంద్రసిద్ధార్థ నిర్మిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. చంద్రసిద్ధార్థ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నా స్నేహితుడైన దర్శకుడు మదన్ చనిపోయే ముందు అందించిన కథ ఇది. హై కాన్సెప్ట్ సైకలాజికల్ థ్రిల్లర్’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పులగం చిన్నారాయణ.