Ram Charan | రామ్‌చరణ్ సినిమా అంటేనే విడుదలకు ముందు హైప్ కామన్. దానికితోడు ‘ఉప్పెన’ లాంటి బ్లాక్బాస్టర్ హిట్ ఇచ్చిన బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఈ సినిమా ఆప్డేట్స్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు చెందిన ఓ వార్త సాంఘిక మాద్యమాల్లో జోరుగా వినిపిస్తున్నది. వివరాల్లోకెళ్తే.. రామ్‌చరణ్, బుచ్చిబాబు కలయికలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్కు ‘పెద్ది’ అనే పేరును ఖరారు చేసినట్టు ఆ వార్త సారాంశం. నిజానికి ఈ టైటిల్‌ని ఎన్టీయార్ సినిమాకోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేయించారు. ఇప్పుడు అదే పేరును చరణ్ సినిమాకు వాడుతున్నట్టు తెలుస్తున్నది.
అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇదిలావుంటే.. ఈ నెల 20న లాంఛనంగా పూజా కార్యక్రమం నిర్వహించి, ఈ సినిమాకు చెందిన పూర్తి వివరాలను నిర్మాతలు ప్రకటించనున్నారట. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటసతీశ్ కిలారు నిర్మించనున్న ఈ సినిమాకు మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. జాన్వి కపూర్ ఇందులో కథానాయిక. విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.