Chiranjeevi | అగ్ర హీరో చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు కె.ఎస్.రవీంద్ర(బాబీ) తెరకెక్కించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తాజా సమాచారం మేరకు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతున్నదని తెలుస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన కథ కూడా లాక్ అయ్యిందట. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్‌ని పూర్తి చేసేపనిలో ఉన్నారు.
ఆ తర్వాత అనిల్ రావిపూడి సెట్లోకి మెగాస్టార్ ఎంటరవుతారు. ఈ రెండు సినిమాల తర్వాత బాబీ సినిమా మొదలవుతుందని తెలుస్తున్నది. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా ‘టాక్సిక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రఖ్యాత కన్నడ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది.