Director Atlee | ఆ హీరోతో ‘జవాన్’ కంటే గొప్ప సినిమా చేస్తా: దర్శకుడు అట్లీ
‘భారతీయ సినిమాకు షారుక్ ఓ అపురూప వరం. నా జీవితంలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో షారుక్ ఒకరు. ‘జవాన్' చిత్రీకరణ సమయంలో షారుక్ నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నా.’ అన్నారు దర్శకుడు అట్లీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ షారుక్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
Director Atlee | ‘భారతీయ సినిమాకు షారుక్ ఓ అపురూప వరం. నా జీవితంలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో షారుక్ ఒకరు. ‘జవాన్’ చిత్రీకరణ సమయంలో షారుక్ నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నా.’ అన్నారు దర్శకుడు అట్లీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అట్లీ మాట్లాడుతూ షారుక్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘అనుకున్న విధంగా సన్నివేశాన్ని చిత్రీకరించగలిగితే సినిమా తప్పక విజయం సాధిస్తుందని ‘జవాన్’ సినిమా అనుభవం నాకు నేర్పింది. ఓపికతో షూటింగ్ చేయడం కూడా ఈ సినిమా నుంచే నేర్చుకున్నా. దీనికి కారణం షారుక్సార్. చిన్నప్పట్నుంచీ నేను ఆయన అభిమానిని.
దిల్వాలే దుల్హనియా లేజాయింగే, ఓంశాంతి ఓం, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ నాకు ఇష్టమైన సినిమాలు. ఆయనతో కలిసి పనిచేయాలనేది నా చిరకాల కోరిక. ‘జవాన్’తో నా కోరిక తీరింది. ఆయన అభిమానాన్ని కూడా పొందగలిగాను. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటం షారుక్సార్కి మాత్రమే సాథ్యం. మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనుంది. ‘జవాన్’కంటే మంచి కథ కుదిరితే తప్పకుండా ఆయనతో వర్క్ చేస్తా’ అని చెప్పుకొచ్చారు అట్లీ. ఆయన దర్శకత్వంలో షారుక్ నటించిన ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

