‘రుద్రంగి’ అందరికీ నచ్చుతుంది
‘నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’కథను రాసుకున్నాను’ అంటున్నారు దర్శకుడు అజయ్ సామ్రాట్.
‘నా బాల్యంలో విన్న కథలు, చూసిన పరిస్థితులు, చదివిన చరిత్ర నుంచి ‘రుద్రంగి’కథను రాసుకున్నాను’ అంటున్నారు దర్శకుడు అజయ్ సామ్రాట్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్రంగి’. జగపతిబాబు, మమత మోహన్‌దాస్, విమలరామన్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శాసనసభ్యులు రసమయి బాలకిషన్ నిర్మించారు.
చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్సామ్రాట్ మీడియాతో ముచ్చటించాడు. ఆయన మాట్లాడుతూ ‘రుద్రంగి’ తెలంగాణ నేపథ్య కథ.ఇందులో చూపించిన సమస్యలు ఎక్కడ వుంటే అక్కడి నుంచి ఈ కథ తీసుకున్నట్లే అవుతుంది. ఆ సమస్యలు ఎక్కడ వచ్చినా ఇలాంటి పోరాటాలే జరుగుతాయి.
ఎమోషనల్ ఫ్యామిలీ, సోషల్‌డ్రామాగా చిత్రాన్ని తెరకెక్కించాను. అరవై రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. పెట్టిన ఖర్చు కంటే విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. తప్పకుండా మా చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. ఇంతకు ముందు నేను బాహుబలి, రాజన్న చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా పనిచేశాను. నా దగ్గర మరికొన్ని కథలు వున్నాయి. ‘రుద్రంగి’ విడుదల తరువాత నా తదుపరి సినిమా విశేషాలను తెలియజేస్తాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

