Emergency | ‘ఎమర్జెన్సీ’ విషయంలో అదే నేను చేసిన పెద్ద తప్పు : కంగనా రనౌత్
Emergency | బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie) విషయంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.
Emergency | బాలీవుడ్ క్వీన్, మండి ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency Movie). 1975-77 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో కంగనా రనౌత్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) పాత్రను పోషించింది. ఆమె దర్శకురాలు కూడా. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం.. పలు వివాదాల కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఎట్టకేలకు తాజాగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం విషయంలో తాను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా ఉండాల్సిందని.. అది తాను చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడం, సినిమా విడుదల ఆలస్యం కావడం వల్ల తాను చాలా బాధపడ్డట్లు తెలిపింది. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వెళ్లుంటే మంచి డీల్ దొరికేదని అభిప్రాయపడ్డారు. అప్పుడు సెన్సార్ బాధలు కూడా ఉండేవి కావన్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాలనుకోవడం తాను చేసిన మొదటితప్పుగా కంగన చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ మూడు పర్యాయాలు ప్రధానిగా చేశారని.. ఆ సమయంలో ఎన్నో ఘటనలు చేటుచేసుకున్నట్లు గుర్తు చేశారు.
గతంలో ఇందిరా గాంధీపై ‘కిస్సా కుర్సీ కా’ మూవీ వచ్చిందని కంగన తెలిపారు. ఆ చిత్రాన్ని ఎవరూ చూడలేదని.. అందుకు కారణం రిలీజ్ కాకుండానే ఆ చిత్రాన్ని బ్యాన్ చేశారన్నారు. ఆ చిత్రానికి సంబంధించిన ఫైల్స్ కూడా దగ్ధం చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇందిరా గాంధీపై ఏ ఒక్కరూ సినిమా తీసే ధైర్యం చేయలేదన్నారు. ఇప్పుడు ఈ సినిమా చూశాకా నేటి తరం వారికి ఇందిరా గాంధీ మూడుసార్లు ప్రధాని ఎలా అయ్యారో తెలుస్తుందని చెప్పుకొచ్చారు.
‘ఎమర్జెన్సీ’ చిత్రంలో జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా చౌదరి, మిలింద్ సోమన్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
“Priyanka Gandhi | ‘ఎమర్జెన్సీ’ సినిమాకి ప్రియాంక గాంధీని ఆహ్వానించిన కంగనా రనౌత్.!”
“Emergency Movie Trailer | ఇందిరాగాంధీ పాత్రలో కంగనా రనౌత్.. ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్ రిలీజ్”
“Emergency | ఎట్టకేలకు ఎమర్జెన్సీ విడుదల ఖరారు.. కొత్త తేదీని ప్రకటించిన కంగనా రనౌత్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

