Priyanka Gandhi | ‘ఎమర్జెన్సీ’ సినిమాకి ప్రియాంక గాంధీని ఆహ్వానించిన కంగనా రనౌత్.!
Emergency Movie – Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే.
Emergency Movie – Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). దివంగత భారత ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన వాయిదా పడింది. అయితే రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను కూడా పంచుకుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 10 రోజులే ఉండడంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది కంగనా.
ఈ క్రమంలోనే ‘ఎమర్జెన్సీ’ సినిమాను చూడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఆహ్వానించినట్లు కంగనా తెలిపింది. పార్లమెంటులో ప్రియాంక గాంధీని కలిశాను. ఆమెని కలిసిన అనంతరం నేను చెప్పిన మొదటి మాట.. ఆప్కో ఎమర్జెన్సీ దేఖ్నీ చాహియే (మీరు ఎమర్జెన్సీ సినిమాని చూడాలి). మీకు ఇది బాగా నచ్చుతుంది అంటూ ప్రియాంకాకు చెప్పాను. అయితే ఈ విషయంలో ప్రియాంక కూడా సున్నింతంగా స్పందిస్తూ.. అవును కావచ్చు (Yeah may be) అంటూ తెలిపినట్లు కంగనా చెప్పుకోచ్చింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రియాంకకు నాన్నమ్మ అవుతుందన్న విషయం తెలిసిందే.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ‘ఎమర్జెన్సీ’ విధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో భారత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోన్నారు. మీడియా ఎలా అణచివేయబడింది. వంటి యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాను జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

