‘ప్రేమిస్తే’ఫేం భరత్, లేఖ ప్రజాపతి, స్నేహ అజిత్ ప్రధాన పాత్రధారులుగా సురేశ్ ఉన్నితన్ దర్శకత్వంలో రజిత్‌రావు నిర్మిస్తున్న చిత్రానికి ‘బ్లాక్ మ్యాజిక్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆదివారం ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉందని, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత రజిత్‌రావు తెలిపారు. లాల్, అజ్మల్ అమీర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం: శ్రీకుమార్ ఆర్కూటీ, కెమెరా: జామ్ అయ్యనాథ్, సంగీతం: బిజిబాల్, ఆర్.సోమశేఖరన్, విష్ణు మోహన్సితార, నేపథ్య సంగీతం: గోపీసుందర్, నిర్మాణం: ఏ2బీ ప్రొడక్షన్స్.