Guntur Kaaram Movie | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరిలు కథానాయికలుగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేశ్ – త్రివిక్రమ్ శైలి మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి దమ్ మసాలా బిర్యానీ, ఓ మై బేబీ సాంగ్‌లను విడుదల చేయగా.. ఈ పాటలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపుతున్నాయి. ఇదిలావుంటే.. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తోంది. అయితే ఈ సాంగ్‌లో మొదట పూజా హెగ్డే చేయనుందని టాక్ వినిపించింది. కానీ లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ ఐటెం సాంగ్ కోసం టాలీవుడ్ డస్కీ బ్యూటీ డింపుల్ హయాతిని ఎంపిక చేశారంట. ఈ స్పెషల్ సాంగ్‌కు డింపులే పర్ఫెక్ట్ అని భావించిన త్రివిక్రమ్ ఈ ఊర మాస్ సాంగ్‌లో దించుతున్నాడని సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో ఓ ఐటంసాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయాతి. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీ, గోపీచంద్‌తో రామబాణంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.