Producer Dilraju | టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు ఒకడు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్‌రాజు అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా సినిమాలను నిర్మించే స్థాయికి వెళ్లాడు. ఇండస్ట్రీలో దిల్‌రాజు జడ్జిమెంట్‌కు తిరుగులేదని అంటుంటారు. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు కానీ, గత మూడేళ్ల కిందట బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫామ్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దిల్‌రాజు అరడజనకు పైగా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇక మూడు నెలల కిందట సంక్రాంతి బరిలో వారసుడును దింపి సక్సెస్ అయ్యాడు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గేమ్‌చేంజర్ సినిమా రూపొందిస్తున్నాడు. ఇదిలా ఉంటే దిల్‌రాజుకు డిస్ట్రిబ్యూటర్‌కు ఓ రెండు సినిమాలు తీవ్ర నష్టాల్ని మిగిల్చాయని ఇటీవలే ఇంటర్వూలో తెలిపాడు.
ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటా అని అనుకుంటున్నారా? అవే స్పైడర్, అజ్ఞాతవాసి. ఈ రెండు సినిమాలను దిల్‌రాజు నైజాంలో రిలీజ్ చేశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై ఎక్కడలైని హైప్ రావడంతో భారీ మొత్తం ఖర్చు పెట్టి ఈ సినిమాలను రిలీజ్ చేశాడు. తీరా రిలీజయ్యాక ఈ రెండు సినిమాలు డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. స్పైడర్ వల్ల 12 కోట్లు, అజ్ఞాతవాసి వల్ల 13 కోట్లు నష్టపోయాడట. ఇక రెండు సినిమాలకు కలిపి రూ.25 కోట్లు నష్టపోయానని దిల్‌రాజు తెలిపాడు. నిర్మాతగా హిట్లు కొట్టకపోయుంటే ఇవి కవర్ అయ్యే పరిస్థితే లేదని దిల్‌రాజు చెప్పుకొచ్చాడు.