Jailer Movie Collections | రిలీజై వారం దాటుతున్న ఇంకా జైలర్ హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో జైలర్ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఇక తెలుగులో దాదాపు పుష్కర కాలంగా హిట్టు చూడని రజనీకు.. జైలర్ బంపర్ హిట్ కొట్టేసింది. మాములుగా ఒక సినిమా బిజినెస్ ఆ ఫలానా హీరో గత చిత్రం కలెక్షన్లను బట్టి జరుగుతుంది. అదే విధంగా జైలర్ సినిమా తెలుగు బిజినెస్ కూడా గత సినిమా వసూళ్లను బట్టి బిజినెస్ జరుపుకుంది. రజనీ చివరి సినిమా పెద్దన్న తెలుగులో అల్ట్రా డిజాస్టర్. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. దాంతో జైలర్ సినిమాకు అంత క్రేజ్ ఉన్నా.. తెలుగులో మాత్రం రూ.12 కోట్లకు బిజినెస్ లెక్కలను క్లోజ్ చేసుకుంది.
ఏషియన్ సునీల్ నారంగ్‌తో కలిసి దిల్‌రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా తెలుగులో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను దాటేసింది. ఇక మూడో రోజు నుంచి లాభాల బాట పట్టింది. ఎన్ని లెక్కలు వేసుకున్న మహా అయితే ఈ సినిమా పది కొట్ల లాభాలు తెస్తుందని అనుకున్నారు. కానీ ఊహించని రేంజ్లో ఈ సినిమాకు రెస్పాన్స్ రావడం.. పోటీగా వచ్చిన భోళా దిబేల్మని పడిపోవడంతో ఈ సినిమా కలెక్షన్లకు రెక్కలొచ్చాయి. రోజు రోజుకు కలెక్షన్ల సంఖ్యతో పాటు టిక్కెట్లు కూడా భారీ రేంజ్లో తెగుతూ వచ్చాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాకు ఒక్క తెలుగులోనే రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అంటే ఇప్పటికే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్‌ను దాటేసింది. ఇక ఈ సినిమా స్పీడ్ చూస్తుంటే మరో 20 కోట్ల షేర్ ఈజీగా రాబట్టే విధంగా అనిపిస్తుంది. పైగా ఖుషీ రిలీజయ్యే వరకు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ పోటీగా ఒక్క సినిమా కూడా లేదు. ఈ లెక్కన దిల్‌రాజుకు తిరుగులేని లాభాలు రావడం ఖాయం. ఈ సినిమాతో దిల్‌రాజుకు తగిలినట్లే.