హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకుడు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్ లోగోను అగ్ర నిర్మాత దిల్‌రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ టైటిల్‌తో నేనొక రొమాంటిక్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్నా. అయితే తమ సినిమా కథకు బాగా సరిపోదుతుందని చెప్పడంతో టైటిల్ ఇచ్చేశాను.
కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అన్నారు. యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇదని, నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుందని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్భూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ రెడ్డి, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్.ఆర్.ధృవన్, వసంత్ జి, నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్‌రెడ్డి.