ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారం రోజురోజుకీ ముదురుతున్నది. సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై పెద్ద రచ్చనే జరిగింది. ఇప్పడు ఇదే విషయంపై మాట్లాడటానికి వస్తున్నా అంటూ దిల్రాజు బాంబు పేల్చాడు. వస్తునా… చాలా ఉంది మాట్లాడాల్సింది అంటూ దిల్రాజు మీడియాతో అన్నాడు. ప్రేస్మీట్ పెట్టి మాట్లాడాతానని చెప్పారు.
నాని మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన సినిమా రిలీజ్ సమయానికి థియేటర్లు మూతపడటంతో ఆవేదనతో మాట్లాడాడు అని దిల్రాజు అన్నారు. ఇప్పడు దిల్రాజు ప్రెస్మీట్పైనే అందరి ఆసక్తి. ఎలాంటి సెన్షేషనల్ కామెంట్స్ చేస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.