Dil Raju Press Meet | గత నాలుగు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ రైడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మీడియా ముందుకు వచ్చాడు దిల్ రాజు.
గత నాలుగు రోజుల నుంచి మా ఇంట్లో ఐటీ రైడులు జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై మీడియాతో పాటు ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేను మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి అనుకున్నాను. 2008లో నా మీద ఫస్ట్ ఐటీ రైడ్ జరిగింది. దాదాపు 16 ఏండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మా ఇళ్లు, కార్యాలయాలపై ఈ దాడులు జరిగాయి. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారు. వ్యాపార రంగంలో ఉన్నవారిపై ఇలాంటి రైడ్స్ జరగడం సాధారణం.
మా కుటుంబంలోని సభ్యులపై మొదటి మూడు రోజులు దాడులు జరుగగా.. ఈ దాడులలో పెద్ద మొత్తంలో డబ్బుతో విలువైన డాక్యుమెంట్లు దొరికినట్లు కొన్ని ఛానల్స్‌తో పాటు యూట్యూబ్ ఛానల్స్ హైలెట్ చేశాయి. అయితే ఈ వార్తలు అబద్దం. ఎక్కడకూడా మా దగ్గరినుంచి డబ్బుకానీ.. డాక్యుమెంట్లు కానీ గుర్తించలేదు. నా దగ్గర రూ.5 లక్షలు, మా శిరిష్ దగ్గర రూ.4.5 లక్షలు ఇలా మా అందరిదగ్గర కలిపి రూ.20 లక్షలు కంటే తక్కువ డబ్బు పన్ను చెల్లించకుండా లభించింది. అలాగే గత 5 ఏండ్ల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీలు కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం కూడా జరగలేదు. మేము నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూషన్, థియేటర్ బిజినెస్‌లో ఉన్నాం కాబట్టి అన్ని వివరాలు చెప్పాలి. అందుకే ఇన్ని రోజులు పట్టింది అంటూ దిల్ రాజు చెప్పుకోచ్చాడు.