Dil Raju | ఆ హీరోలు బాలీవుడ్‌ను చూసి నేర్చుకోవాలి.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లపై ఓపెన్ అయిన దిల్ రాజు
Dil Raju | ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని టాలీవుడ్‌లోని పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోల రెమ్యునరేషన్లు, భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్లు, బాలీవుడ్లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ విధానం, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుబంధం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
Dil Raju | ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని టాలీవుడ్‌లోని పలు కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోల రెమ్యునరేషన్లు, భారీ బడ్జెట్ సినిమాలు, బాక్సాఫీస్ కలెక్షన్ పోస్టర్లు, బాలీవుడ్లో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ విధానం, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుబంధం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సినిమాల బడ్జెట్లు విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం హీరోల పారితోషికాలేనని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. సినిమా మార్కెట్, బిజినెస్ సామర్థ్యాన్ని బట్టి రెమ్యునరేషన్ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక రూ.300 కోట్ల సినిమా తీస్తే అందులో 35 నుంచి 40 శాతం వరకు బడ్జెట్ కేవలం హీరో రెమ్యునరేషన్‌కే వెళ్తోంది. ఇది నిర్మాతలపై భారీ భారం పెడుతోంది అని ఆయన పేర్కొన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు తమ ఇమేజ్, మార్కెట్ విలువ దెబ్బతింటుందనే భయంతో రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి ముందుకు రావడం లేదని దిల్ రాజు తెలిపారు. ఒకసారి పారితోషికం తగ్గిస్తే మార్కెట్ తగ్గిందనే భావన ఏర్పడుతుందనే ఆలోచన చాలామందిలో ఉందన్నారు.సినిమా ప్రారంభించే ముందు ప్రాజెక్ట్ వ్యాపార సామర్థ్యం, మార్కెట్ పరిస్థితులను హీరోలకు వివరించి, ఆ మేరకే పారితోషికంపై చర్చిస్తానని ఆయన చెప్పారు. హిందీ చిత్ర పరిశ్రమలో అమలవుతున్న ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను దిల్ రాజు ప్రశంసించారు. బాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం కంటే సినిమా లాభాల్లో వాటా తీసుకునే విధానాన్ని అనుసరిస్తున్నారని చెప్పారు.
ఈ విధానం వల్ల నిర్మాతలపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, హీరోల్లో కూడా సినిమా విజయంపై మరింత బాధ్యత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో టాలీవుడ్లో కూడా ఈ విధానం రావాల్సిన అవసరం ఉందన్నారు.ఇటీవల సినిమాల కలెక్షన్ పోస్టర్లపై జరుగుతున్న చర్చలపై కూడా దిల్ రాజు స్పందించారు. పరిశ్రమలో అసలు వసూళ్లు ఏమిటి, ప్రచార పోస్టర్లలో చూపించే సంఖ్యలు ఏమిటి అన్న విషయం నిర్మాతలకు తెలుసునని ఆయన అన్నారు.అభిమానులు తమ హీరో సినిమా పెద్ద విజయంగా నిలిచిందని చెప్పుకోవాలని కోరుకుంటారని, గత సినిమాల కంటే ఎక్కువ సంఖ్యలు చూడాలని ఆశిస్తారని పేర్కొన్నారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమాలే దీర్ఘకాలంలో విజయాన్ని సాధిస్తాయని, కేవలం పోస్టర్లతో మాత్రమే సినిమా నిలబడదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు రెండు దశాబ్దాలకుపైగా స్నేహం ఉందని దిల్ రాజు వెల్లడించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాధ్యతల విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్రోత్సాహం ఉందని, మొదట తనకు పెద్దగా ఆసక్తి లేకపోయినా తర్వాత అంగీకరించినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

